మ‌హేష్ బాబు క్యారెక్టర్ పై వివాద‌స్ప‌ద ట్వీట్!

by velandi.Saikiran |

రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమాలో దాదాపు 5 పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారట.

మ‌హేష్ బాబు క్యారెక్టర్ పై వివాద‌స్ప‌ద ట్వీట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రిన్స్ మహేష్ బాబు, ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. ఈ సినిమాలో దాదాపు 5 పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేస్తుండగా హీరోయిన్ అవతారంలో ప్రియాంక చోప్రా మెరువనున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ఈ మూవీ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. వారణాసి సినిమా సమయంలో ప్రియాంక చోప్రాకు అవమానం జరిగినట్లు పేర్కొన్నాడు. షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రా పట్ల అసభ్యకరంగా మహేష్ బాబు ప్రవర్తించినట్లు ట్వీట్ చేసి రచ్చ చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను కించపరిచేలా వ్యవహరించాడు. ఈ వారణాసి సినిమా వల్ల ఇకపై సౌత్ ఇండియాలో ప్రియాంక చోప్రా ఒక్క సినిమా కూడా చేయబోదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై మహేష్ బాబు అభిమానులు ఫైర్ అవుతున్నారు. మహేష్ బాబు శ్రీరామచంద్రుడు లాంటివాడని కౌంటర్ ఇస్తున్నారు. link

Next Story