- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గాయపడ్డ సింహం’నికి కండిషన్స్ అప్లై
డిఫరెంట్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు.

దిశ, సినిమా: డిఫరెంట్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తుండగా.. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. దిల్ రాజు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టీజర్ చాలా నచ్చింది. తర్వాత కాన్సెప్ట్ కూడా చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశాం. అయితే దానికి కూడా కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఏప్రిల్ 30కి పెద్ది సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ఒకవేళ పెద్ది రిలీజ్ అయితే ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుంది. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనుకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది’ అని తెలిపారు.






