విజయ్ దేవరకొండపై పోలీసు కేసు నమోదు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-01 15:12:06  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై పోలీస్ కేసు నమోదు

విజయ్ దేవరకొండపై  పోలీసు కేసు నమోదు  !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ పై పోలీస్ కేసు నమోదు అయిందని సమాచారం అందుతోంది. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... విజయ్ దేవరకొండ పైన ఫిర్యాదు అందింది. ఆ పోలీస్ స్టేషన్ లో లాయర్ కిషన్ చౌహన్... హీరో విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదు మేరకు... ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. రెట్రో సినిమా ఈవెంట్ లో ఆదివాసులను విజయ్ దేవరకొండ అవమానించారని... ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు లాయర్ కిషన్ లాల్ చౌహన్. ఇక లాయర్ కిషన్ ఇచ్చిన ఫిర్యాదు పై... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, సూర్య నటించిన రెట్రో ఈవెంట్ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను గురించి మాట్లాడబోయి... గిరిజనులు అంటూ వ్యాఖ్యానించాడు విజయ్ దేవరకొండ. దీంతో అప్పటినుంచి విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు గిరిజనులు.

Next Story