- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాఫ్ట్వేర్ వాళ్ళతో పోలిక సరికాదు : తమ్మారెడ్డి భరద్వాజ
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతన వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాతల నాలుగు ప్రతిపాదనలపై చర్చలు జరిగాయని, ఈ సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయని ఆయన తెలిపారు. తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్‌ను నిర్మాతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తమ్మారెడ్డితో నిర్మాతలు ఈ చర్చలు జరపడం కీలకంగా మారింది. సమావేశం అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. సినీ కార్మికులు రోజువారీ వేతనం తీసుకుంటారు కాబట్టి, నెలలో ఎన్ని రోజులు పని చేస్తారనేది కీలకమని అన్నారు.
ఒక్కో కార్మికుడు నెలకు 10-15 రోజులు మాత్రమే పని చేస్తున్నారని, దీనిని బట్టి వారి ఆదాయాన్ని అంచనా వేయాలని ఆయన సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సినీ కార్మికుల వేతనాలను పోల్చడం సరికాదని, రెండూ వేర్వేరు పరిశ్రమలు, వేర్వేరు పని పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వేతన వివాదం తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారి కాదని, గతంలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తాయని, అయితే చర్చల ద్వారా పరిష్కారం చూసేందుకు ప్రయత్నిస్తున్నామని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
నిర్మాతలు ప్రతిపాదించిన నాలుగు కీలక అంశాలలో ఒకటి.. చిన్న నిర్మాతలు 30% వేతన పెంపును భరించలేరని, ఈ ప్రతిపాదన ఫెడరేషన్ విరమించుకోవాలని అన్నారు. రెండవది.. తెలుగు సినీ పరిశ్రమలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే అధిక వేతనాలు చెల్లిస్తున్నామని, ఇంకా వేతనాలు పెంచడం పరిశ్రమకు ఆర్థిక భారం కలిగిస్తుందని తెలిపారు. మూడవది.. నైపుణ్యం కలిగిన కార్మికులను యూనియన్‌లో ఉన్నా, లేకపోయినా నియమించుకోవడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాలుగవది షూటింగ్‌లను అడ్డుకునే, బెదిరింపులకు పాల్పడే కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవడం.






