- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబీ-మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్.. పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు బాబీ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ (Mega 158) కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో స్టార్ హీరోయిన్ ప్రియమణి కథానాయికగా యాక్ట్ చేస్తుంటే యంగ్ బ్యూటీ కృతి శెట్టి చిరుకు డాటర్ రోల్ ప్లే చేయనున్నదట.
ఈ క్రమంలో ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నాడనే విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇది కేవలం అతిథి పాత్రలా కాకుండా కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవనున్నారట. మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..






