ఓ వీరుడి కథతో మీ ముందుకు వస్తున్నా.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన స్టార్ హీరో

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్-2’(Kesari Chapter-2). ఈ సినిమా ‘కేసరి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

ఓ వీరుడి కథతో మీ ముందుకు వస్తున్నా.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి చాప్టర్-2’(Kesari Chapter-2). ఈ సినిమా ‘కేసరి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ 1919 జలియలి వాలాబాగ్ ఊచకోత ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది సి. శంకరన్ నాయర్(Sankaran Nair) న్యాయం కోసం చేసిన పోరాటం గురించి తెలియజేయనున్నట్లు సమాచారం. అయితే ఇందులో అనన్య పాండే(Ananya Pandey), ఆర్ మాధవన్(R Madhavan) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కేసరి-2’ మూవీ ఏప్రిల్ 18న థియేటర్స్‌లో రానుంది.

దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అక్షయ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ ఫొటో షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ జత చేశారు. ‘‘నేను ధరించినవి కేవలం దుస్తులు మాత్రమే కాదు. ఇవి సంప్రదాయానికి, ప్రతిఘటనకు, సత్యానికి, నా దేశానికి చిహ్నం. అయితే సి శంకరన్ నాయర్ ఆయుధంతో పోరాడలేదు. అతను బ్రిటిష్ సామ్రాజ్యంతో చట్టంతో, ఆత్మతో, అగ్నితో పోరాడాడు. ఈ ఏప్రిల్ 18న పాఠ్య పుస్తకాలలో ఎప్పుడూ చెప్పని ఓ వీరుడి కథను మీ ముందుకు తీసుకువస్తున్నాము’’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం అక్షయ్ కుమార్ పోస్ట్ నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఇందులో కథకళి గెటప్‌లో ఉన్న ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కాగా, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో పాటు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ లోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు(Mohan Babu) 24 ఫ్రేమ్స్, అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), ప్రభాస్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, మధుబాల, అరియానా, వివియానా, అవ్రామ్, దేవరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ‘కన్నప్ప’ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story