‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ నుంచి కమెడియన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటూ పోస్ట్

by I. Sairam |   (  Updated:2026-02-06 09:30:39  IST  )

90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయ‌నే స్వ‌యంగా నిర్మాత మారి త‌న శ్రీ శివాజీ ప్రొడక్షన్స్(Sri Shivaji Productions) పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు.

‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ నుంచి కమెడియన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: 90s వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో దూసుకు పోతున్న హీరో శివాజీ (Sivaji) ప్రస్తుతం ఆయ‌నే స్వ‌యంగా నిర్మాత మారి త‌న శ్రీ శివాజీ ప్రొడక్షన్స్(Sri Shivaji Productions) పతాకంపై ‘సంప్రదాయని సుప్పిని సుద్ధపూసని’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో ల‌య (Laya) శివాజీకి జంట‌గా న‌టిస్తోండ‌గా ప్రిన్స్‌(Prinse), అలీ(ali), ధ‌న్‌రాజ్‌(Dhanraj), ఇమ్మాన్యూయేల్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సుధీర్ శ్రీరామ్(Sudheer Sreeram) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రంజిన్ రాజ్(Ranjin Raj) సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఈ నెల 12న ఈటీవీ విన్‌(ETV Win)లో స్ట్రీమింగ్‌ కానున్నది. ఈ క్రమంలో తాజాగా కమెడియన్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్‌ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను పంచుకుంటూ.. ‘లుక్స్ సీరియస్‌గా ఉన్నా.. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.

ఇమ్మాన్యుయేల్ మైఖేల్‌గా - తనదైన శైలిలో నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉన్నాడు. సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని పిచ్చికి 6 రోజులు మిగిలి ఉన్నాయి .. ఒక @etvwin అసలు చిత్రం రాబోతుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో ఇమ్మూ ముక్కుకు బ్యాండేజ్‌తో శాడ్‌గా కనిపించాడు. ఇందులో అతను మైఖేల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story