విడుదలకు సిద్ధమైన ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’

by Sujitha Rachapalli |

సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్‌హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ,

విడుదలకు సిద్ధమైన ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’
X

దిశ, సినిమా : సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్‌హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీవోపీ శివశంకర వరప్రసాద్, నటీనటులు దినేష్, చంద్రకళ, జోగారావు, బుగత సత్యనారాయణ, దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్, ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు పాల్గొన్నారు.

Next Story