- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకుడిని రెండో పెళ్లి చేసుకున్న కలర్ స్వాతి.. SMలో ఫొటోలు వైరల్
‘కలర్స్’ కార్యక్రమంతో తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి రెడ్డి.. వెండితెరపై కూడా బెస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: ‘కలర్స్’ కార్యక్రమంతో తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన స్వాతి రెడ్డి.. వెండితెరపై కూడా బెస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. గత కొద్ది కాలంగా తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాటన్నింటినే నిజం చేస్తూ.. స్వాతి రెండో పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. 2018లో వికాస్ వాసు అనే పైలట్‌ను వివాహం చేసుకున్న స్వాతి.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత అతడితో విడిపోయారు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ.. ‘మంత్ ఆఫ్ మధు’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘మంత్ ఆఫ్ మధు’ షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకాంత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లికి దారితీసింది. ఈ మేరకు నటి 'కలర్స్' స్వాతి, దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని రెండో వివాహం చేసుకున్నారు. జులై 8న తాము వివాహబంధంలో అడుగుపెట్టినట్లు, ఫోటోలను షేర్ చేస్తూ స్వాతి స్వయంగా సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






