- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం.. నెట్టింట ఫొటోలు వైరల్
ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా అనేక విలన్, హీరో, తండ్రి పాత్రల్లో నటించిన లెజెండరీ యాక్టర్ డాక్టర్ ఎం. మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా అనేక విలన్, హీరో, తండ్రి పాత్రల్లో నటించిన లెజెండరీ యాక్టర్ డాక్టర్ ఎం. మోహన్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 26న 77వ రిపబ్లిక్ డే సందర్భంగా పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలుగు నటుడికి ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్ కతాలోని లోక్ భవన్లో జరిగిన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బోస్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. అనంతరం జరిగిన ఎట్ హోమ్ రిసెప్షన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోల్లో మోహన్ బాబు వెంట మంచు విష్ణు, నటుడు శివబాలాజీ కూడా ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు దాదాపు 50 సంవత్సరాలకు పైగా నటుడిగా సేవలందించిన, ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న మోహన్ బాబుకు ఈ అవార్డు దక్కడం గర్వించదగిన విషయమని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఇది ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.






