- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ వర్సెస్ ‘ఉస్తాద్’ ..రెండు ఒకే రోజున రిలీజ్ కానున్నాయా?
టాలీవుడ్ అగ్ర హీరోలు మార్చి నెలలో తమ కొత్త సినిమాలతో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోలు మార్చి నెలలో తమ కొత్త సినిమాలతో రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్-బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతోంది. మార్చి 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అటు నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా కూడా పెద్ది కంటే ఒక్కరోజు ముందు అంటే మార్చి 26వ తేదీన రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాలు ఇప్పటికే అధికారికంగా తమ రిలీజ్ తేదీలను ప్రకటించాయి. దీంతో రాంచరణ్, నాని సినిమాల మధ్య క్లాష్ ఏర్పడుతుందని అందరూ మొన్నటి వరకు చర్చించుకున్నారు. ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా మార్చిలోనే రిలీజ్ కానుందట. పెద్ది రిలీజ్ తేదీ రోజే ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ 15వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేస్తారని ముందుగా ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు కానీ కాస్త ముందుగానే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట.
అంటే బాబాయి వర్సెస్ అబ్బాయి అన్నట్లుగా ఫైట్ ఉండబోతుందని చర్చ కూడా జరుగుతోంది. అయితే అలా జరగదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఒకే కుటుంబం నుంచి వచ్చే హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయబోరని అంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మార్చి 27వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయి, పెద్ది సినిమా ఏప్రిల్ లో రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెద్ది సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం కానుందట. అందుకే ఆ సినిమాను వాయిదా వేసి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా ముందుకు వస్తోన్నట్లు తెలుస్తోంది.






