Kantara: Chapter 1: వాయిదా లేదు.. ఆ స్టార్ హీరో సినిమా రిలీజ్‌పై మరోసారి క్లారిటీ

by Chukka Sudharani |

కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ ‘కాంతార చాప్టర్ -1’.

Kantara: Chapter 1: వాయిదా లేదు.. ఆ స్టార్ హీరో సినిమా రిలీజ్‌పై మరోసారి క్లారిటీ
X

దిశ, సినిమా: కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్-2 థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కాంతార చాప్టర్-1 అనుకున్నట్లుగా అక్టోబర్-2 న థియేటర్స్‌లో రాబోతున్నది అని తెలిపారు. అలాగే.. ఒక లెజెండ్ యొక్క దైవిక మూలాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.. కాంతారా చాప్టర్ 1 నార్త్ అమెరికా అంతటా సెప్టెంబర్-2న థియేటర్లలోకి వస్తుంది.. దీనిని ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేయబోతున్నారు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. లింక్

Next Story