- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Suriya45 టైటిల్ రిలీజ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఆనందంలో ఫ్యాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో సూర్య-45 ఒకటి. Suriya45 అనే వర్కింగ్ టైటిల్‌తో అనౌన్స్ చేసిన ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అనౌన్స్‌మెంట్ తప్ప ఈ సినిమా నుంచి ఏ అప్‌డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు సూర్య 45పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ‘Suriya45 సినిమా షూటింగ్ మొత్తం ఒక వారంలో పూర్తవుతుంది.. ఈ సినిమా టైటిల్ ప్రకటన జూన్ రెండవ వారంలో లేదా జూన్ మూడవ వారంలో విడుదల అవుతుంది. సూర్య45 ఒక వేడుక చిత్రంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను పండుగ రోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ నిర్మాత కామెంట్స్ వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
- #Suriya45's entire shoot wraps up in a week
— Movie Tamil (@MovieTamil4) May 27, 2025
- The title announcement for this film will be released in the second week of June or the third week of June.
- This film will be a celebration film.
- We are planning to release this film on a festive day.
pic.twitter.com/KLDwf5P3XV






