మూవీ లవర్స్‌కు BIG షాక్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-18 11:45:03  IST  )

తెలుగు సినిమా(Telugu Film Industry) ప్రేక్షలకు అనూహ్య షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రా ఫిల్మ్ ఎగ్జిబిబర్లు(Film Exhibitors) కీలక నిర్ణయం తీసుకున్నారు.

మూవీ లవర్స్‌కు BIG షాక్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా(Telugu Film Industry) ప్రేక్షలకు అనూహ్య షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రా ఫిల్మ్ ఎగ్జిబిబర్లు(Film Exhibitors) కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు(Cinema Theaters) బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని.. పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని సోమవారం ఫిల్మ్ ఛాంబర్ ఆఫీస్‌లో నిర్వహించిన ఎగ్జిబిబర్ల సంయుక్త సమావేశంలో తీర్మానించారు. అప్పటివరకు థియేటర్లన్నీ మూసేయాలని భావించారు.

కాగా, గతంలోనూ ఎగ్జిబిబర్లు ఈ తరహా డిమాండ్ చేశారు. కాకపోతే అప్పుడు.. సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలు, అదనపు ఆటలను ప్రదర్శించడం వల్ల నష్టపోతున్నామని.. అందువల్ల వాటిని కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్, నిర్వహణ అసోసియేషన్ సభ్యులు నాడు ప్రకటించారు. అయితే.. తరచూ ఎగ్జిబిటర్లు ఈ తరహా డిమాండ్ చేయడంతో నిజంగానే థియేటర్ల మనుగడ కష్టంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వచ్చాకే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

Next Story