సినిమా అంటే శర్వానంద్‍కు ఇంత పిచ్చా… వెండితెరకు సాష్టాంగ నమస్కారం

by Pulgam srinivas |

థియేటర్ స్క్రీన్ వద్ద సాష్టాంగ నమస్కారం చేసిన శర్వానంద్

సినిమా అంటే శర్వానంద్‍కు ఇంత పిచ్చా… వెండితెరకు సాష్టాంగ నమస్కారం
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో దగ్గర నుండి చిన్న టెక్నీషియన్ వరకు అందరూ కూడా దాదాపుగా సినిమా పట్ల తమ అభిమానాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం సినిమాపై తమకున్న పిచ్చిని అప్పుడప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో శర్వానంద్ ఒకరు. ఈయనకు సినిమా అన్నా, సినిమా పరిశ్రమ అన్నా ఎంతో ఇష్టం. దీనిని పలు సందర్భాలలో ఆయన బయటపెట్టారు. ఇక మరోసారి సినిమా అంటే ఆయనకు ఎంత పిచ్చి అనేది రుజువైంది.

తాజాగా శర్వానంద్ నటించిన బైకర్ చిత్రం ఏప్రిల్ 3న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. దాంతో శర్వానంద్ చాలా థియేటర్లను సందర్శిస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు శ్రీరాములు థియేటర్ కి వచ్చాడు. థియేటర్ స్క్రీన్ వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత స్క్రీన్ ను ముట్టి దానిని మొక్కాడు. ఇక ప్రస్తుతం శర్వానంద్ కి సంబంధించిన ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. స్క్రీన్ ముందు సాష్టాంగ నమస్కారం చేయడం, ఆ తర్వాత దాన్ని మొక్కడంతో సినిమా అంటే ఈయనకు ఇష్టం కాదు, పిచ్చి అనిపలువురు నెటిజన్లు ఈయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story