సినీ కార్మికుల సమ్మె ఉద్ధృతం.. నేడు కృష్ణానగర్‌లో నిరసన ర్యాలీ

by Yella Dhawani Reddy |

ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించాలేదు. అంతేకాదు, సమ్మెను ఉద్ధృతం చేస్తూ ఆదివారం సిని కార్మికులు కృష్ణానగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.

సినీ కార్మికుల సమ్మె ఉద్ధృతం.. నేడు కృష్ణానగర్‌లో నిరసన ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్: జీతల పెంపు కోసం గత వారం రోజులుగా టాలీవుడ్ (Tollywood) సినీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) నాయకులు డిమాండ్ చేస్తుండగా.. నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికుల వేతనాలు విడతల వారీగా.. మొదటి విడతగా 15 శాతం, తర్వాత రెండు, మూడు విడతల్లో 5 శాత చొప్పున వేతనాలను పెంచుతామని నిర్మాతలు వివరించారు. అయితే, ఇలా విడతల వారీగా పెంచేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ అంగీకరించాలేదు. అంతేకాదు, సమ్మెను ఉద్ధృతం చేస్తూ ఆదివారం సిని కార్మికులు కృష్ణానగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అన్నపూర్ణ 7 ఎకర్స్‌ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్‌ విభాగాల సభ్యులు పాల్గొననున్నారు.

అలాగే, నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తీరుపై నిరసన తెలపడంతో పాటు తమ భవిష్యత్ కార్యాచరణను కూడా ఫిలిం ఫెడరేషన్‌ ఇవాళ ప్రకటించనుంది. కాగా సినీ కార్మికుల సమ్మె కారణంగా తనకు రోజుకు రూ.కోటి వరకు నష్టం జరుగుతుందని పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ సిటీ సివిల్ కోర్టులో యూనియన్‌పై కేసు వేశారు. ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకటకృష్ణకు లీగల్ నోటీసు పంపారు. ఈ వ్యవహారంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story