Tollywood: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
Tollywood: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్(Choreographer) జానీ మాస్టర్‌(Johnny Master)కు మరో బిగ్ షాక్ తగిలింది. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్(Choreographers Association) నుంచి ఆయన్ను శాశ్వతంగా తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న జానీ మాస్టర్‌కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఎన్నికలు నిర్వహించి జోసెఫ్ ప్రకాశ్‌(Joseph Prakash)ను కొత్త అధ్యక్షుడిగా ఆదివారం ఎన్నుకున్నారు. తాజాగా.. ఈ అంశంపై జానీ మాస్టర్ స్పందించారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం పోరాటం చేస్తానని ప్రకటించారు.

వస్తోన్న ప్రచారాలన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను ఇంకా మెంబర్‌గా ఉన్నానని అన్నారు. మెంబర్‌గా తనను ఎవరూ తొలగించలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్‌కు ఇటీవల వరుస షాక్‌లు తగులుతున్నాయి. లైంగిక ఆరోపణలతో జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఆయన జైల్లో ఉండగానే నేషనల్ అవార్డును రద్దు చేశారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండా ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. మరోవైపు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్‌కు 2023 నుంచి జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Next Story

Most Viewed