- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చియాన్ విక్రమ్ 64 అప్డేట్.. 'లుక్ షూట్' స్టార్ట్ అంటూ పోస్ట్
తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘Chiyaan64’ కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘Chiyaan64’ కోసం సిద్ధం అవుతున్నాడు. 96, మెయ్యాళగన్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ కుమార్.సీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్‌పై ఇషారి గణేష్, కుష్మితా గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్క్స్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా గోకులం స్టూడియోస్‌లో ‘Chiyaan64’కి సంబంధించిన 'లుక్ షూట్' జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మరిన్ని అప్డేట్స్ విక్రమ్ పుట్టినరోజు అనగా ఏప్రిల్ 17న వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






