చిరుత ఫర్ చాంపియన్

by Sujitha Rachapalli |

జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చాంపియన్’. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రూల్స్‌లో కనిపించబోతున్న సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్

చిరుత ఫర్ చాంపియన్
X

దిశ, సినిమా : జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌, స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చాంపియన్’. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రూల్స్‌లో కనిపించబోతున్న సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన గిరిగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ కాగా డిసెంబర్ 25న మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు. డిసెంబర్ 18న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ‘చిరుత ఫర్ ఛాంపియన్’ స్పెషల్ వీడియోలో చిరుతోస్తే చిందే వెయ్యాలా సాంగ్ అభిమానులని అలరించింది. ఇక తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు. ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలో ఉండేలా లీనం చేస్తుండగా.. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.

Next Story