- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకీ మామకు విషెస్ తెలిపిన చిరు.. ఆ ఫొటో షేర్ చేయడంతో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తుండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నారు.
అయితే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా ఓ క్యూట్ ఫొటో షేర్ చేస్తూ.. ‘వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు ఎక్కడికి వెళ్లినా ఓ పాజిటివీని తీసుకొచ్చారు. అలాగే మన శంకర వరప్రసాద్ గారు మూవీ షూటింగ్ సమయంలో మనం పంచుకున్న ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆదరిస్తాను.. రాబోయే ఇయర్స్‌లో మీరు ఇంతే హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అని షూటింగ్ టైంలో తీసుకున్న వీరిద్దరి క్రేజీ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. దీన్ని చూసిన నెటిజన్లు వెంకీకు బర్త్‌డే విషెస్ తెలుపుగా ఫ్యాన్స్ మాత్రం మీ ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా హ్యాపీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.






