చిరంజీవి "మన శంకర వర ప్రసాద్ గారు" ట్విట్టర్ టాక్

by Ajay Maddhiboyina |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా జ‌న‌వ‌రి 12 థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు సినిమా ప్రీమియ‌ర్స్ షోలు వేశారు.

చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు ట్విట్టర్ టాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా జ‌న‌వ‌రి 12 థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు సినిమా ప్రీమియ‌ర్స్ షోలు వేశారు. అయితే ఇప్ప‌టికే సినిమా ఫస్ట్ ఆఫ్ చూసిన అభిమానులు త‌మ అభిప్రాయాల‌ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ఫ‌స్ట్ ఆఫ్ బాగుంద‌ని చెబుతున్నారు. సినిమా మొద‌ట్లో కాస్త అటు ఇటుగా ప్రారంభ‌మైనా త‌ర‌వాత బాగుంద‌ని అంటున్నారు.

సినిమాలో మ్యూజిక్ బాగుంద‌ని, చిరంజీవి ప‌ర్ఫామెన్స్ ఎన‌ర్జిటిక్ గా ఉంద‌ని కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా చిరు కామెడీ టైమింగ్ చాలా బాగుంద‌ని చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే రాజాసాబ్ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వ‌స్తోంది. హార‌ర్ర కామెడీ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంతగా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఇక మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు సినిమా పూర్తి రివ్యూ రేపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పాజిటివ్ టాక్ వ‌స్తే ఈ సంక్రాంతికి చిరు హిట్ కొట్టిన‌ట్టే.

Next Story