- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఎన్నార్ చీ కొట్టిన పాటే చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ రచయిత
ఏఎన్నార్ రిజెక్ట్ చేసిన పాటను ‘ఖైదీ’ చిత్రంలో ఉపయోగించగా అది అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు రచయిత కనగాల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమా లేదా పాటను మరొకరు స్వీకరించి మంచి గుర్తింపును అందుకున్న సందర్భాలు అనేకం ఉంటాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి రచయిత కనగాల జయకుమార్ కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ గారు హీరోగా నటించిన ‘గోపాలకృష్ణుడు’ సినిమా కోసం “ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా తడిపడి ఊహల పొడి దెబ్బ తొలకరి వలపుకు గురుతబ్బా” అనే పాటను రికార్డ్ చేశారని, నాగేశ్వరరావు గారు ఈ పాట కోసం మేకప్ వేసుకుని షూటింగ్‌కి కూడా సిద్ధమయ్యారని, ఇక షూటింగ్ స్టార్ట్ కావడానికి కొంత సమయం ముందు ఒకసారి పాట వినిపించండి అని కోదండరామిరెడ్డిని కోరారు.
ఆ పాట వినగానే ఆయన ముఖంలో మార్పు వచ్చిందని, ఈ లిరిక్స్ తన సినిమాకు సరిపోవని, “నా సినిమాలకు ఎక్కువగా కుటుంబాలు, మహిళలు వస్తుంటారు. ఇలాంటి లిరిక్స్ ఉన్న పాట ఉంటే వారు అసౌకర్యంగా భావిస్తారు. కాబట్టి ఈ పాటను మార్చండి” అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్లిపోయారని వివరించారు. ఆ తర్వాత ఆ సాంగ్ స్థానంలో వేరే పాటను పెట్టినట్లుగా చెప్పారు. ఇక కొంతకాలానికి చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ’ సినిమాలో ఆ పాటను ఉపయోగించారు. ఆ పాట ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందడంతో పాటు సినిమాకు కూడా మంచి హైప్ తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.






