- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ సినిమాలో మెగాస్టార్ చిరు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే ?
భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో రవితేజ దూసుకు వెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి కూడా వర్క్ చేయబోతున్నారట. ఈ సినిమాలో రవితేజ పాత్రను చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ వాయిస్ ఓవర్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
దీంతో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రవితేజ కోసం చిరు వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు జీ-గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా జీ-స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రానుందట.






