రామ్ చరణ్-ఉపాసనలకు ఇష్టం లేకుండా.. మనవరాలి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి?

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-29 08:49:02  IST  )

మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత జూన్ 20న పడ్డంటి ఆడపిల్లకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్-ఉపాసనలకు ఇష్టం లేకుండా.. మనవరాలి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత జూన్ 20న పడ్డంటి ఆడపిల్లకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. చిరంజీవి మనవరాలు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మందికి మనవరాలు పుట్టిన ఆనందంలో చిరంజీవి పార్టీ ఇచ్చినట్లు టాక్. ఆ పాప జాతకం గురించి వేణు స్వామి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ పాప మహార్జాతకురాలు అయినప్పటికీ ఆమె జాతకంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు తెలిపారు. తాజాగా, చిరంజీవి మనవరాలి కోసం వేణు స్వామిని పిలిపించి ఇంట్లోనే పరిహార పూజలు చేయించాలని నిర్ణయించుకున్నాడట. కానీ, అలా చేయించడం రామ్ చరణ్-ఉపాసనలకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వారు ఇలాంటివి నమ్మరట దీంతో ఇప్పుడే అవన్నీ ఎందుకని అంటున్నారట. చిరంజీవి మాత్రం కొడుకు కోడలు మాటలను పట్టించుకోకుండా మనవరాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేణు స్వామిని ఇంటికి పిలిపించి పూజలు చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం మెగా ప్రిన్సెస్‌ జాతకంకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది.

Read More: ఉపాసన డెలవరీకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసా?

Next Story