రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన చిరంజీవి.. కారణం అదేనంటూ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara).

రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన చిరంజీవి.. కారణం అదేనంటూ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సోసియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి(Vikram Reddy) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘విశ్వంభర’ చిత్రం జనవరి నెలలో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, చిరంజీవి దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘‘నన్ను నేను జాతీయంగా స్థాపించుకోవడానికి రాజమౌళితో కలిసి పనిచేయాలని నాకు అనిపించడం లేదు. అందుకే నేను అతనితో పని చేయనని చెప్పాను. ఆయన ఇక సినిమాకే 4-5 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. నేను ఒకేసారి నాలుగు చిత్రాల షూటింగ్స్ చేస్తున్నాను.ఆ సమయాన్ని అంకితం చేయడం నాకు ఇష్టం లేదు’’ అని చెప్పుకొచ్చినట్లు సమాచారం.ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఎంతోమంది ఆయనతో సినిమాల చేయాలని భావిస్తుంటే.. చిరు ఇలా అనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story