మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగాస్టార్ ఇంటికి టాలీవుడ్ పంచాయితీ
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కార్మికులు షూటింగులను సైతం బైకాట్ చేశారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతలు ఇప్పటికే కార్మిక సంఘాలతో భేటీ అయినప్పటికీ సమస్య పరిష్కారం అవ్వలేదు. సమ్మె మొదలై ఇప్పటికే 13 రోజులకు చేరుకుంది. 24 క్రాఫ్ట్ లకు చెందిన సుమారు 15వేల మందికి పైగా రిజిస్టర్ అయిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు.

తమ వేతనాలను 30 శాతం పెంచాలని కార్మికులు కోరుతుండగా నిర్మాతలు మాత్రం సానుకూలంగా స్పందించడంలేదు. అనేక సార్లు సమావేశాలు జరిగినా ఏదో ఒక మెలిక పెడుతూనే ఉన్నారు. కార్మికులు కూడా తమ డిమాండ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇలానే కొనసాగితే షూటింగ్ జరుగుతున్న సినిమాలపై ప్రభావం పడనుంది. దీంతో ఈ పంచాయితీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకుంది. ఆయనను పెద్దగా ఉండాలని, సమస్యను పరిష్కరించాలని నిర్మాతలు, ఫెడరేషన్ కోరుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు విడివిడిగా చిరంజీవిని కలవనున్నారు. ఇరువర్గాలతో జరిగే సమావేశంలో చిరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story