- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్‌గారు. ఈ సినిమాలో చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొన్న హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు చిరంజీవికి కూడా మరో హిట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే సినిమా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
అంతేకాదు ఈ మూవీలో గెస్ట్ రోల్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. ఇందులో ఒక సాంగ్ తో పాటు దాదాపు 20 నిమిషాల పాటు వెంకటేష్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే విక్టరీ వెంకటేష్ ను ఈ సినిమాలోకి తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి సూచనలు చేశారట. ఈ మేరకు స్వయంగా చిరు ఒప్పించారట. దీంతో విక్టరీ వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కాగా ఇటీవలే విక్టరీ వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా పూర్తయింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా, అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయి, కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టింది. త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం 2 కూడా రానుంది.






