- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఒక్కడిదే కాదు, ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్ అవ్వాలి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 సంక్రాంతిని తెలుగు చిత్రసీమ మర్చిపోకూడదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 సంక్రాంతిని తెలుగు చిత్రసీమ మర్చిపోకూడదని అన్నారు. అలాంటి సంక్రాంతిని ప్రేక్షకులు ఇవ్వాలన్నారు. ఈ ఏడాది కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలు వస్తున్నాయన్నారు. తన సినిమాను మాత్రమే కాకుండా అన్ని సినిమాలను ఆశీర్వదించాలన్నారు. ప్రభాస్, నవీన్ పొలిశెట్టి, శర్వానంద్, రవితేజ అందరి సినిమాలు మంచి విజయం సాధించాలన్నారు. రాఘవేంద్ర రావు ఒకప్పుడు తనతో అనిల్ రావిపూడితో సినిమా చేయాలని చెప్పారని ఆయన చేతులతోనే ఈ సినిమాకు క్లాప్ కొట్టారన్నారు.
సంక్రాంతికి వస్తున్నాం తరవాత అనిల్ రావిపూడి వచ్చిన తనకు ఈ కథ చెప్పాడన్నారు. తనకు కథ చాలా నచ్చిందని చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తైన తరవాత ఫేవరల్ పార్టీలా బాధపడ్డానని అన్నారు. ఇది వరకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ రాలేదన్నారు. ప్రతిరోజు షూటింగ్ చాలా సరదాగా సాగేదని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇంత సరదాగా చేసిన సినిమా లేదన్నారు. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిందన్నారు. అనుకున్న రోజుల్లో సినిమా పూర్తి చేశాడని, అనుకున్న బడ్జెట్ లోనే అనిల్ సినిమా పూర్తి చేశాడు కాబట్టి ఆల్రెటీ హిట్ అయిందన్నారు. విక్టరీ వెంకటేష్ తో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అతడు మోడ్రన్ గురూజీలా కనిపిస్తాడన్నారు. వెంకీతో షూటింగ్ చేసినట్టు లేదని చాలా ఎంజాయ్ చేశామన్నారు.






