ChiranjeeviAnil: చిరంజీవిఅనిల్ ‘మెగా-157’ అప్డేట్.. సెకండ్ షెడ్యూల్ నుంచే బరిలోకి మూవీ టీమ్

by Chukka Sudharani |

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ‘మెగా-157’ (Mega-157) రాబోతున్న విషయం తెలిసిందే.

ChiranjeeviAnil: చిరంజీవిఅనిల్ ‘మెగా-157’ అప్డేట్.. సెకండ్ షెడ్యూల్ నుంచే బరిలోకి మూవీ టీమ్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ‘మెగా-157’ (Mega-157) రాబోతున్న విషయం తెలిసిందే. నయనతారా (Nayantara) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ కామెడీ డ్రామాను షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్, అర్యన్ ప్రజెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే మెగా అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. ఈ మేరకు.. ‘అనిల్ చిరు Mega157 ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్‌(First schedule in Hyderabad)లో జరిగింది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక తర్వాత రెండో షెడ్యూల్ కేరళ(Kerala)లో అనుకుంటున్నారు.

అంతే కాకుండా.. రిలీజ్‌కి ముందు కాదు.. సెకండ్ షెడ్యూల్ నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు’ అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక అనిల్ రావిపూడి ప్రమోషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌తోనే సగం హిట్ చేశాడు ఈ డైరెక్టర్. అలాగే మెగా-157 ఇంట్రడ్యూషన్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేసి చిత్ర బృందాన్ని ఒక్కొక్కరిగా పరిచయం చేసి ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇలా తన ప్రమోషన్స్ స్టంట్‌తోనే సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసే అనిల్.. ఇప్పుడు మెగా157 కోసం సెకండ్ షెడ్యూల్ నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే.. ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story