- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiranjeevi and Srikanth Odela : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. బంపర్ ఆఫర్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రజెంట్ ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రంతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రజెంట్ ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తు్న్నారు చిత్ర బృందం. ఇక ఈ మూవీ తర్వాత యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కొత్త జోనర్‌లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పకుడిగా (presenter) వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి హీరో నాని అనౌన్స్ చేస్తూ.. రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే.. ఆ పోస్టర్ తప్ప ఈ సినిమాపై మరో అప్‌డేట్ ఇవ్వలేదు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి, ఓదెల సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ (Interesting buzz) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా కీలకంగా ఉంటుందట. అందుకే ఈ పాత్ర కోసం బాలీవుడ్ (Bollywood)లో ఒకప్పుడు అందాల భామగా క్రేజ్ తెచ్చుకున్న రాణీ ముఖర్జీ (Rani Mukherjee)ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు ఇన్‌సైడ్ టాక్. రాణీ ముఖర్జీ అయితే ఆ పాత్రకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని భావించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చిరంజీవికి చెప్పగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో.. బాలీవుడ్ బ్యూటీ రాణీ ముఖర్జీని ఇందులో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. అయితే.. ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






