- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chinmayi: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం స్పందించిన చిన్మయి.. మీడియాపై ఫైర్ అవుతూ షాకింగ్ ట్వీట్
స్టార్ సింగర్ కల్పన(Singer Kalpana) మంగళవారం నాడు ఆత్మహత్యాయత్రం చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: స్టార్ సింగర్ కల్పన(Singer Kalpana) మంగళవారం నాడు ఆత్మహత్యాయత్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను షాక్‌కు గురి చేసింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోపని నిజాంపేట్‌లో భర్తతో కలిసి నివాసం ఉంటున్న ఈమె రెండ్రోజులుగా డోర్ ఓపెన్ చేయకుండా గదిలోనే ఉండిపోయారు. దీంతో అది గమనించిన స్థానికులు ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కల్పన ఇంటికి చేరుకుని బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరించిన సంగతి తెలిసిందే.
అయితే చికిత్స చేసిన వైద్యులు ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు గుర్తించారు. ఇక ఈ విషయంపై పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎన్నో పుకార్లు షికార్లు అవుతున్నాయి. భర్తతో గొడవ కారణంగానే అలా చేసిందని కొందరు అంటుంటే.. మరికొందరు ఏమైందో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చికిత్స పొందుతున్న కల్పనను కలుసుకోవడానికి కుటుంబ సభ్యులతో పాటు సింగర్స్, సినీ సెలబ్రిటీలు కూడా హాస్పిటల్ బాటపట్టారు. ఈ క్రమంలోనే.. కల్పన కూతురు తన తల్లిది ఆత్మహత్యాయత్నం కాదని అలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని ట్యాబెట్లు ఓవర్ డోస్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, కల్పన ఆత్యహత్యాయత్నంపై సెన్సేషనల్ సింగర్ చిన్మయి( Chinmayi) రియాక్ట్ అయింది.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రముఖ సింగర్ కల్పన సంఘటనకు సంబంధించిన వార్తా కవరేజీని సానుకూలంగా, బాధ్యతాయుతంగా నివేందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణ కుటుంబం, సమాజంపై ఈ సున్నితమైన సంచలనాత్మక కవరేజీ ప్రభావం పడతుందని అంచనా వేయండి. సింగర్ కల్పనతో ఎలాంటి సంబంధం లేని వాళ్లని తీసుకొచ్చి డిబేట్లు పెడుతున్నారు.. ఇదంతా అత్యంత వరెస్ట్ పని.. అలాంటి వారిని పట్టుకొచ్చి.. చర్చించి.. ఏం చెప్పదల్చుకుంటున్నారు.. ఆమె కోలుకుని వచ్చాక.. ఈ చెత్తంతా చూడాలని అనుకుంటున్నారా?.. మీడియాకు ఎథిక్స్ లేవా?.. ఇలాంటి చర్చల్లో పాల్గొనకండి..సూసైడ్‌ను ఎలా రిపోర్ట్ చేయాలనే గైడ్ లైన్స్ ఉన్నాయి..కానీ ఆ రూల్స్‌ని ఎవ్వరూ పాటించడం లేదు.. ఇలాంటి చర్చల్లో పాల్గొనవద్దని సింగర్లను కోరుతున్నాను’’ అని రాసుకొచ్చింది. కొందరు చిన్మయికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
A brilliant genius of a colleague and a singer I have always highly respected has attempted to take her life and is in ICU.
— Chinmayi Sripaada (@Chinmayi) March 5, 2025
Telugu channels calling people who have absolutely NO familial relationship with her asking for an opinion to ‘discuss’ this is perhaps the worst anyone…






