వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రామ్ చరణ్

by Sujitha Rachapalli |

200 మిలియన్లకు పైగా వ్యూస్ తో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చికిరి చికిరి సాంగ్

వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రామ్ చరణ్
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’తో మ్యూజిక్ ప్రమోషన్స్ అద్భుతంగా ప్రారంమయ్యాయి. కాగా ఈ ట్రాక్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. ఐదు భాషలలో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. AR రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట అదిరిపోయే బీట్, ఎనర్జీ, ఫెస్టివల్ వైబ్, రామ్ చరణ్ వైరల్ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది.‘చికిరి చికిరి’ ఇప్పటికే భారీ రిపీట్ వాల్యూను సాధిస్తూ 2 మిలియన్‌కు పైగా లైక్స్‌, మ్యూజిక్ ప్లాట్‌ఫాంలలో 60 మిలియన్‌కు పైగా ఆడియో స్ట్రీమ్స్‌ను రాబట్టి చార్ట్‌లను ఏలుతోంది. 300K కంటే ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, 870K యూట్యూబ్ షార్ట్స్‌లో నెటిజన్లు ఐకానిక్ హుక్ స్టెప్‌ను రిక్రియేట్ చేస్తున్నారు. ఇది యంగ్ ఆడియన్స్‌లో గ్లోబల్ మూమెంట్‌గా మారింది. ఇక ఈ చిత్రం మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

Next Story