- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
viral video: రామ్ చరణ్‌ను కలిసేందుకు ఈ అభిమాని ఏం చేస్తున్నాడో చూడండి!
తమ అభిమాన నటీనటుల కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు.

దిశ, వెబ్ డెస్క్: తమ అభిమాన నటీనటుల కోసం ఫ్యాన్స్ ఏమైనా చేస్తారు. ముఖ్యంగా వారి సినిమాలు విడుదల సమయాల్లో, వారి బర్త్ డేలకు రక్తదానం, అన్నదానంతో పాటూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే వారిని ఒక్కసారైనా డైరెక్ట్‌గా కలువాలని ఆశ పడుతుంటారు. అందుకోసం వినూత్న ప్రయత్నాలకు శ్రీకారం చుడుతుంటారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేసి.. చివరికి వారిని కలుసుకుని తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి తన అభిమాన హీరో కోసం పాదయాత్ర ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'RRR' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కడికి వెళ్లిన చెర్రీని కలిసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వస్తుంటారు. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాంకి చెందిన శేఖర్ అనే వ్యక్తి తన అభిమాన హీరో అయిన రామ్ చరణ్‌ను కలిసేందుకు పాదయాత్ర చేపట్టాడు. రామ్ చరణ్ సంబంధించిన పోస్టర్ సహా జాతీయ జెండా, ప్లకార్డులు పట్టుకొని విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. గత 8 రోజులుగా దాదాపు 250 కిలో మీటర్లు దూరం పయనించాడు. స్థానికులు గమనించి అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక 'గేమ్ ఛేంజర్' సినిమాతో పరాజయం చవిచూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం 'RC 16' చిత్రంలో నటిస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చెర్రీకి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం.






