- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chay- Shobitha: భార్య స్టోరీపై అదిరిపోయే రిప్లై ఇచ్చిన నాగ చైతన్య.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నాగ చైతన్య(Naga chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeth Arts Banner)పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మిస్తున్నారు. యథార్థ ప్రేమ సంఘటన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం లవర్స్ కానుకగా ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్(Trailer), గ్లింప్స్(Glimps) ఆకట్టుకోగా.. సాంగ్స్(songs)కి అయితే ప్రత్యేక రెస్పాన్స్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ రోజు అనగా ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా ఈ మూవీటీమ్‌కు తన సతీమణి, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామి’ అనే క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్‌కు నాగ చైతన్య రియాక్ట్ అవుతూ.. ‘థాంక్యూ నా బుజ్జి తల్లి’ అనే రిప్లై ఇస్తూ రీ పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీ బాండింగ్ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నాగ చైతన్య సమంత(Samantha)తో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ ఆగస్టు 8న ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరు తన మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మ్యారేజ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా తండేల్ కావడంతో ఈ సినిమాపై నాగ చైతన్య భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నాడు.






