- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sharwanand: చార్మింగ్ స్టార్ శర్వా న్యూ లుక్‌కు షాక్‌లో ఫ్యాన్స్..
చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ చిత్రం ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా తన 36వ చిత్రం ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇది ప్రతిష్టాత్మక UV క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. హై-ఎనర్జీ స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ నుంచి.. తాజాగా దీపావళి స్పెషల్‌గా విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది. ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ పాత్రలో నటిస్తున్న శర్వా.. ఈ సినిమా కోసం ఫుల్ మేకోవర్ అయ్యాడు. అలాగే రీసెంట్‌గా తన లుక్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. చొక్కా లేకుండా పంచుకున్న ఈ ఫొటోస్ చూస్తుంటే ‘బైకర్’ కోసం శర్వా పడుతున్న కష్టం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. కాగా.. ఈ సినిమాలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- Tags
- Sharwanand
- Biker






