- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈ పోస్ట్‌ను లైక్ చేసిన వాళ్లు త్వరలోనే ఒక శుభవార్త వింటారు’: Charmy Kaur
నీతోడు కావాలి అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ చార్మీ కౌర్.

దిశ, వెబ్‌డెస్క్: నీతోడు కావాలి అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ చార్మీ కౌర్. తొలిసారిగా తను నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేదు. కానీ వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు లభించాయి. దర్శకుడు కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు.
తర్వాత నీకే మనసిచ్చానులో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. పలు సినిమాలు పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. చార్మీ కౌర్ పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగా ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.
2007 డిసెంబరులో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టింది. క్యూట్ పిక్స్ పంచుకుని...‘‘‘ఈ పోస్ట్‌ను లైక్ చేసిన వాళ్లు త్వరలోనే ఒక శుభవార్త వింటారు’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.






