- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూవీ హిట్ కావడంతో చరణ్ నాకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు.. సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్‌గారు’(Mana Shanakara Varaprasad Garu) చిత్రం సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో వెంకటేష్(Venkatesh) కీ రోల్ ప్లే చేసింది.
అయితే ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటితోపాటు మెగా డాటర్ సుస్మిత కొణిదెల(Sushmitha Konidela) నిర్మాతగా వ్యవహరించారు. తండ్రి ఖాతాలో భారీ విజయాన్ని జమ చేశారు సుస్మిత. ప్రజెంట్ ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సుస్మిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు రామ్ చరణ్ ప్రతీ రాఖీకు చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు.
నాకు ఏది ఇష్టమో అది కనుక్కొని ఇస్తాడు. అయితే రీసెంట్‌గా కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి వచ్చి.. "నాన్నతో చాలా బాగా చేశావ్.. సినిమా చాలా బాగుంది.. ఇప్పుడు నీకు చాలా దిష్టి తగులుతుంది" అని చెప్పి వేసుకోమని రామ్ చరణ్ 'ఈవిల్ ఐ' గిఫ్ట్ ఇచ్చాడు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






