- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Charan- Prabhas: ఎట్టకేలకు డార్లింగ్ పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన చరణ్.. అమ్మాయిది ఎక్కడంటే..?
Charan- Prabhas: Charan who finally gave a hint about Darling's marriage.. where is the girl..?

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కీ 2 వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ సినిమాల విషయంలో చాలా ఫాస్ట్‌గా ఉన్నా.. పెళ్లి విషయంలో మాత్రం చాలా స్లో అనే చెప్పాలి. తన తోటి హీరోలు, అలాగే వయసులో తక్కువ ఉన్న హీరోలు కూడా ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫాదర్స్ కూడా అయ్యారు. కానీ మన డార్లింగ్ మాత్రం పెళ్లి అంటే ఆరడుగుల దూరంలో ఉంటాడు. ఎన్నో షోస్‌లలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినా చిన్న స్మైల్ ఇచ్చి ఆ టాపిక్‌ని డైవర్ట్ చేసేస్తాడు. ఈ క్రమంలో ఇతని మ్యారేజ్‌కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ (సీజన్-4) షోకి గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ తన ఫ్యామిలీ గురించి సినీ కెరీర్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి కూడా రామ్ చరణ్ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షోలో భాగంగా బాలయ్య బాబు డార్లింగ్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా .. చరణ్ దీనిపై స్పందిస్తూ పెళ్లి కూతురు ఎవరో చెప్పనప్పటికీ ఎక్కడి వారో చెప్పారని టాక్.
అయితే అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఉంటారని చెప్పినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ షోలో నిజంగానే రామ్ చరణ్.. ప్రభాస్ పెళ్లి గురించి చెప్పాడా లేదా అనేది తెలియాలంటే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్, నెటిజన్లు త్వరలోనే మా డార్లింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ఫుల్ ఖుషీలో ఉన్నారు.






