- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’లో ‘చికిరి’ పాటకు మార్పులు.. “సరుకు సామాన్” పదంపై సెన్సార్ అభ్యంతరం?
పెద్ది చిత్రంలోని ‘చికిరి’ పాటలో “సరుకు సామాన్” అనే పదాన్ని మార్చాలని సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సూచించినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తైనట్లు సమాచారం. ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే సెన్సార్ బృందం సినిమాలోని కొన్ని పదాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ‘చికిరి’ పాటలోని “సరుకు సామాన్ ” అనే పదాన్ని మార్చాలని సీబీఎఫ్‌సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) సూచించినట్లు సమాచారం. దీంతో థియేటర్లలో ఈ పాట ప్రసారం సమయంలో ఆ లైన్ స్థానంలో కొత్త పదం లేదా కొత్త లిరిక్ వినిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘పెద్ది’ ఆ అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






