మైండ్ బ్లాక్ అయ్యే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సెట్ చేసిన చందు మొండేటి

by Pulgam srinivas |

అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి హీరోలుగా ఉజ్జయిని నేపథ్యంగా హిస్టారికల్ థ్రిల్లర్ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మైండ్ బ్లాక్ అయ్యే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సెట్ చేసిన చందు మొండేటి
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయిన చందు మొండేటి ఒక భారీ ప్రాజెక్టును సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈయన ఆఖరుగా తండేల్ చిత్రాన్ని రూపొందించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన సూర్య హీరోగా ఓ చిత్రం చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. ఆ తర్వాత ఈ దర్శకుడు ఒక యానిమేషన్ సినిమా చేయాలని కూడా ప్రయత్నాలు చేశాడు. అయితే అది కూడా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కానీ తాజాగా ఈయన ఒక మైండ్ బ్లాక్ అయ్యే మల్టీస్టారర్ మూవీని సెట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే... అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి హీరోలుగా ఉజ్జయిని నేపథ్యంగా హిస్టారికల్ థ్రిల్లర్ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమాకు సంబంధించిన కథను వివరించగా, వారు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమాలో భాగం కావడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు ఓ కీలక పాత్రలో మరో స్టార్ హీరో కూడా ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీని నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇలా భారీ ప్రాజెక్టును సెట్ చేసుకోవడంతో, ఈ దర్శకుడు కొంతకాలం వేచి చూసినా కూడా చివరికి సూపర్ ఛాన్స్ దక్కించుకున్నాడని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story