- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrahas: నాకుశ్రీ లీలతో ఒక్క సాంగ్ పడితే..ఇండస్ట్రీ షేక్ కావాల్సిందే
హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ( Barabar Premistha). ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు హీరో చంద్రహాస్.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వస్తున్నారు. ఇందులో కొంత మంది హీరోలు సక్సెస్ అవుతుంటే, మరి కొంత మంది సక్సెస్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటీవీ ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ( Attitude Star Chandrahas) డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా సెన్సేషన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఓ పాట పాడి పెంట పెంట చేశారు చంద్రహాస్. ఈ వివాదం నేపథ్యంలో చంద్రహాస్ పై కేసు కూడా నమోదయింది. అయితే ఈ సంఘటన మర్చిపోకముందే హీరోయిన్ శ్రీ లీల డాన్స్ పై హాట్ కామెంట్స్ చేశారు చంద్రహాస్. దీంతో ఈ కామెంట్లు కూడా ఇప్పుడు వివాదంగా మారాయి.
హీరోయిన్ శ్రీ లీల డ్యాన్స్ పై చంద్రహాస్ హాట్ కామెంట్స్
హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ( Barabar Premistha). ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు హీరో చంద్రహాస్. అయితే ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ లీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రహాస్. ఒక పాట స్త్రీలతో తనకు పడితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందని బాంబు పేల్చారు. తను నాతో పోటీగా డాన్స్ చేస్తే బాగుంటుంది కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు శ్రీ లీల తనకంటే తక్కువ డాన్స్ చేస్తుంది అనే మీనింగ్ వచ్చేలా ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడడం వివాదంగా మారింది. దీంతో చంద్రహాస్ పైన శ్రీ లీల ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్లింగ్ చేస్తున్నారు. నీ ముఖానికి ఎప్పుడైనా డాన్స్ చేసావా? ఒక్క పాట పాడితేనే ఇంత పెంట పెట్టావు ? ఇప్పుడు హీరోయిన్ శ్రీ లీల డాన్స్ గురించి మాట్లాడుతున్నావా ? అని మండిపడుతున్నారు.
లవ్ నేపథ్యంలో బరాబర్ ప్రేమిస్తా సినిమా
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ( Attitude Star Chandrahas) నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా Barabar Premistha). ఈ సినిమాలో మేఘన ముఖర్జీ హీరోయిన్ గా (Meghana Mukharji ) నటించారు. ఈ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా సీసీ క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. అదిలాబాద్ జిల్లాలోని రుద్రారం అనే గ్రామంలో రెండు వర్గాలు ఉంటాయి. ఆ రెండు వర్గాల మధ్య కుల విద్వేషాలు, పరువు, ప్రతిష్ట అంటూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చిగురుస్తుంది. దాని కోసం ఈ ఇద్దరు పడే కష్టమే సినిమా కథ. అయితే, లవ్ నేపథ్యంలో వచ్చిన బరాబర్ ప్రేమిస్తా సినిమా జనాలకు పెద్దగా ఎక్కనట్లే కనిపిస్తోంది. సినిమా చూసిన వాళ్లు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.






