ఈ జర్నీ స్టార్ట్ అయి త్రీ ఇయర్స్ కంప్లీట్ అంటూ అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన చాందిని చౌదరి.. సూపర్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి(Chandini Chowdary) జంటగా నటించిన సినిమా ‘సమ్మతమే’(Sammathame).

ఈ జర్నీ స్టార్ట్ అయి త్రీ ఇయర్స్ కంప్లీట్ అంటూ అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన చాందిని చౌదరి.. సూపర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి(Chandini Chowdary) జంటగా నటించిన సినిమా ‘సమ్మతమే’(Sammathame). గోపీనాథ్ రెడ్డి(Gopinath Reddy) తెరకెక్కించిన ఈ మూవీ 2022 జూన్ 24 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఈ రోజుతో ఈ సినిమా విడుదల అయి మూడు సంవత్సరాలు పూర్తి అయింది. దీంతో హీరోయిన్ చాందిని చౌదరి తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

అందులో హీరో కిరణ్ అబ్బవరంతో దిగిన క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘సమ్మతమే మూవీకు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. నేను వర్క్ చేసిన వాటిల్లో నా ఫేవరేట్ స్టోరీస్ ఇది’ అని హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఈ సినిమా సూపర్ ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story