- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhaava: రష్మిక మందన్న ‘ఛావా’కు బిగ్ షాక్.. వారు ఓకే అన్నాకే రిలీజ్ చేయాలంటూ మంత్రి షాకింగ్ కామెంట్స్..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava).

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి బిగ్ షాక్ తగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్(Uday Samant) ఛావా మూవీ పై సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని మొదటగా చరిత్రకారులకు చూపించాలి. వారు మూవీ చూసి ఓకే అన్నాకే రిలీజ్ చేయాలి, లేదంటే నిషేధం తప్పదు అని హెచ్చరించారు. అలాగే శంభాజీ రాజే డ్యాన్స్ సీన్‌పైన అభ్యంతరం చెబుతూ.. ఆ సీన్ తొలగించాలని, ఆయన గౌరవానికి భంగం కలిగితే తీవ్ర పరిణామాలు తప్పవు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






