సమంత సాంగ్‌కు డ్యాన్స్ చేసిన సెలబ్రిటీ కపుల్.. మిక్సీలో బ్లేడ్ తిరుగుతున్నట్లు ఆ చేతులను తిప్పుతున్నారని ఫన్నీ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-05-07 14:41:29  IST  )

స్టార్ కపుల్ రాహుల్(Rahul)- చిన్మయి(Chinmayi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

సమంత సాంగ్‌కు డ్యాన్స్ చేసిన సెలబ్రిటీ కపుల్.. మిక్సీలో బ్లేడ్ తిరుగుతున్నట్లు ఆ చేతులను తిప్పుతున్నారని ఫన్నీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ కపుల్ రాహుల్(Rahul)- చిన్మయి(Chinmayi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. లవ్ చేసుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీరికి ఒక పాప, బాబు(ట్విన్స్). సింగర్ చిన్మయి సమంత(Samantha)కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తమ పిల్లల ఫొటోస్, వీడియోస్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటారు.

ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో సమంత నిర్మాతగా నిర్మిస్తున్న ‘శుభం’(Subham) సినిమాలోని ఓ స్టెప్‌ను ఈ జంట రీ క్రియేట్ చేశారు. వీరిద్దరే కాకుండా వీరి పిల్లలు కూడా ఆ స్టెప్పుకు చిందులేశారు. అయితే చిన్మయి డ్యాన్స్ బాగానే వేసింది. కానీ రాహుల్ మాత్రం డ్యాన్స్ రాక చాలా ఇబ్బంది పడుతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు.. చిన్మయి డ్యాన్స్ బాగా చేసింది, కానీ రాహుల్ మిక్సీలో బ్లేడ్ తిరుగుతున్నట్లు తిప్పుతున్నారని, అది డ్యాన్స్ లాగా లేదని స్టీరింగ్ తిప్పుతున్నట్టుగా ఉందని తెగ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story