డైరెక్టర్ అట్లీ కుటుంబంలో సంబరాలు... ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియా

by Pulgam srinivas |

అట్లీ–ప్రియా దంపతులకు తాజాగా ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని అట్లీ అధికారికంగా ప్రకటించారు.

డైరెక్టర్ అట్లీ కుటుంబంలో సంబరాలు... ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియా
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైన అట్లీ కుమార్, నటి మరియు నిర్మాత అయిన ప్రియాను దాదాపు 8 సంవత్సరాలు ప్రేమించి, 2014 నవంబర్ 9న చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2023 జనవరి 31న తొలి సంతానంగా మగబిడ్డ జన్మించాడు. ఆయనకు ‘మీర్’ అని పేరు పెట్టారు. ఇక తాజాగా ఈ దంపతులకు రెండవ సంతానం కలిగింది. ఈ విషయాన్ని అట్లీ అధికారికంగా వెల్లడించారు. తమకు ఆడబిడ్డ జన్మించినట్లు ఆయన ఆనందంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ, అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దీపికా పదుకొనే ఇటీవల గర్భవతి అయినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సంబంధించిన దర్శకుడికి ఆడబిడ్డ జన్మించడంతో, ఆ చిత్ర బృందానికి వరుసగా శుభవార్తలు అందుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story