- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adivi Sesh: కంటెంట్ విషయంలో అతి జాగ్రత్త అవసరం.. అందుకే సినిమాలకు ఈ ఆలస్యం తప్పదు.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్ అడివి శేష్
యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్’.

దిశ, సినిమా: యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్’. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తు్న్న ఈ మూవీకి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో అడివి శేష్.. సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇస్తున్నాడో చెప్పుకొచ్చాడు.
టాలెంట్ ఉన్న మీ లాంటి మిడ్ రేంజ్ హీరోలు కూడా సినిమాలు చాలా లేట్‌గా తీస్తున్నారు. దీనికి కారణం ఏంటని ప్రశ్నించగా.. ‘ఈ మధ్య నేను కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. చాలా మంది అంటున్నారు హీరోలు త్వరగా సినిమాలు చేయాలని. అయితే.. నాకు అర్థం అయినంత వరకు ఏంటంటే.. పబ్లిక్‌లో చాలా స్టాండెడ్ పెరిగిపోయింది. కరోనా టైమ్‌లో అన్ని లాంగ్వేజెస్‌లో వాళ్లు చూడాల్సిన సినిమాలు చూసేశారు. దీంతో వాళ్లు మేకింగ్ అనేది ఒక టాప్ ప్లేస్‌లో ఉండాలి అనుకుంటున్నారు. ఈ రోజు వాళ్లకు ఒక హాలీవుడ్, తెలుగు ఫిలిమ్‌కు డిఫరెంట్స్ అవసరం లేదు.
మనం ఒక 5 ఏళ్ల క్రితం అనుకున్న VFX ఎఫెక్ట్స్ ఇప్పుడు చూపిస్తే.. వాళ్లు దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు. మినిమమ్ ఇంటర్నేషనల్ ఉండాలి.. లేకపోతే వద్దు మాకు అన్నట్లు ఉన్నారు ఆడియన్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌లో సినిమాలు చేయాలి. కానీ ఇంటర్నేషనల్ బడ్జెట్స్ లేవు, స్కిల్ లేవు, ఇంటర్నేషనల్ క్రూ మెంబర్స్ ఇక్కడ అంత ఈజీగా దొరకరు. కాబట్టి ఇవన్నీ మనం దాటుకుని ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడియన్స్‌కు క్రియేట్ చేయాలి. కాబట్టి కంటెంట్ విషయంలో అతి జాగ్రత్త పడక తప్పదు. అందుకే నేను ఆలోచించి సినిమాలు చేస్తున్నాను. అయితే.. మిగిలిన హీరోలకు సినిమాల విషయంలో గ్యాప్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు’ అని చెప్పుకొచ్చాడు అడివి శేష్.






