- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జన నాయగన్’ చివరి సినిమా అంటూ ప్రచారం.. తలపతి విజయ్ సంచలన స్టేట్‌మెంట్
తమిళ స్టార్ తలపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan).

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ తలపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఆదివారం విజయ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో పాటు ‘ఫస్ట్ రోర్’ పేరుతో మూవీ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో సింహాసనం మీద ఠీవిగా కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని విజయ్ కనిపించాడు. నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు.. ప్రజల కోసం వస్తాడు అనే క్యాప్షన్‌తో మొదలైన గ్లింప్స్ తలపతి విజయ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
అయితే, ఇటీవలే హీరో విజయ్ రాజకీయాల్లో్కి రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. తమిళగా వెట్రి కజగం (Vetri Kazagam in Tamil) పార్టీని స్థాపించారు. అదేవిధంగా 2026 ఎన్నికల్లో స్వత్రంత్రంగా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా చిత్రం ‘జన నాయగన్’ విజయ్ చివరిదంటూ.. ఇకపై సినిమాల్లో నటించబోరంటూ సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వస్తున్న వార్తలపై తాజాగా తలపతి విజయ్ స్వయంగా స్పందించారు. ‘జన నాయగన్’ చివరి చిత్రం అనే విషయం తన చేతుల్లో లేదన్నారు. 2026 ఎన్నికల ఫలితాలపై నిర్ణయం ఆధారపడి ఉందని విజయ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయ్ సినిమాలను వదలరని.. హిట్టుల మీద హిట్లు కొడతూ సినిమాలు చేస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.






