- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kalki 2: ‘కల్కి 2’ నుంచి క్రేజీ అప్‌డేట్... దీపికా స్థానంలో ఆ అందాల తార ?
ప్రియాంక దత్, అశ్వని దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా వచ్చిన మూవీ కల్కీ ( Kalki 2898 AD). ఈ సినిమా 2024 సంవత్సరంలో రిలీజ్ అయి బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెలుగు మూవీకి నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించారు. చూడడానికి సింపుల్ గా ఉన్న ఆయన, ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకువెళ్లాడు.
ఈ సినిమాకు ప్రియాంక దత్, అశ్వని దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. దాదాపు 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1000 కోట్లు క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు కల్కి 2 కూడా వస్తోంది. అయితే, ఈ కల్కి సినిమాలో గర్భవతిగా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే, ఈ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. దీంతో కల్కి సీక్వెల్ లో దీపికా స్థానంలో ఎవరు నటిస్తారు? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 8 గంటల వర్క్ విధానం పై దీపికా వ్యాఖ్యలే ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తొలగించడానికి కారణం అయినట్లు ప్రచారం అయితే సాగుతోంది.
ఈ ప్రాజెక్టు నుంచి దీపికా ఔట్ కావడంతో, ఆమె స్థానంలో సాయి పల్లవి, అనుష్క లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఫైనల్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ కథకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు కల్కిలో కూడా ఛాన్స్ కొట్టేసిందట ప్రియాంక చోప్రా.






