- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శశిరేఖ పాటకు డ్యాన్స్ చేసిన బస్సు కండక్టర్
శశిరేఖ పాట పెట్టుకుని స్టెప్పులు ఇరగదీసాడు కండక్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటించిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు ( Mana Shankara Varaprasad Garu). ఈ సినిమా సంక్రాంతికి విడుదలై, భారీగా కలెక్షన్స్ రాబడుతోన్న సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న పాటలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని శశిరేఖ పాటకు ( Sasirekha ) ఓ ఆర్టీసీ కండక్టర్ స్టెప్పులు వేశాడు.
బస్సు ఎక్కిన ప్రయాణికుల అందరికీ టికెట్లు కొట్టిన తర్వాత, శశిరేఖ పాట పెట్టుకుని స్టెప్పులు ఇరగదీసాడు కండక్టర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. మరి కొంతమంది ఆర్టీసీ బస్సులో ఇలా చిందులు వేయడం ఏంటని చురకలు అంటిస్తున్నారు.
సంక్రాంతికి హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా రెండు రోజుల్లో 122 కోట్లు రాబట్టింది. కథ ఇందులో చిరంజీవి హీరోగా చేయగా నయనతార హీరోయిన్ గా మెరిసింది. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు.






