తెలుగు అమ్మాయని పిలిచి అవకాశం ఇస్తే నాకే కండీషన్లు పెట్టింది.. హీరోయిన్ నాగదుర్గపై బన్నీ వాసు కామెంట్స్

by Chukka Sudharani |

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై యంగ్ హీరో ప్రియదర్శి, యూట్యూబ్ స్టార్ నాగ దుర్గ జంటగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

తెలుగు అమ్మాయని పిలిచి అవకాశం ఇస్తే నాకే కండీషన్లు పెట్టింది.. హీరోయిన్ నాగదుర్గపై బన్నీ వాసు కామెంట్స్
X

దిశ, సినిమా: సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై యంగ్ హీరో ప్రియదర్శి, యూట్యూబ్ స్టార్ నాగ దుర్గ జంటగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో వంశీ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఓ స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో ప్రియదర్శి, నాగదుర్గ కొత్త పెళ్లి జంటగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ నాగ దుర్గపై నిర్మాత బన్నీ వాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నాగదుర్గను నేను పిలిచి సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇస్తే.. ఇన్ని సినిమాలు చేశారు, సుకుమార్ గారు ఉన్నారు కదా నా ఆఫర్‌కు హ్యాపీగా ఉంటారు అనుకున్నా. కానీ నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ, నాకు ఎంత ఆనందం అనిపించిందంటే.. నేను తనను డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తే ఇంత క్లారిటీగా ఉంటుందా అనే ఫీలింగ్ కలిగింది. నేను ఏం చెయ్యగలను, ఏం చెయ్యలేను అంత క్లారిటీగా చెప్పారు. నాగదుర్గను చూసి అప్పుడు అనిపించింది నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తున్నా అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం. ఎందుకంటే నాగదుర్గ ఈ సినిమాకు అంత ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చాడు.

Next Story